Tuesday, January 20, 2026

పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు

కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు రైతుల వద్ద అదనంగా వసూళ్లు..

వరంగల్, నిఘా న్యూస్: వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ పరిధి లో CCI పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కొందరు ఫిర్యాదులు చేశారు. వారు చేసిన ఫిర్యాదుల ప్రకారం… రైతు సరుకును తేమ కౌడి క్వాలిటీ పేరుతో రిజెక్ట్ చేస్తున్నారు. దళారులకు మిల్లర్లకు సహకరించి ఒక పెద్ద అధికారి బలంతో ఓ కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటంతో కింటాలుకు 100/- రూపాయలు వసూలు చేస్తూ కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు వాటాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ జిల్లాలో 15 నుండి 20 లక్షలు కింటాళ్ళు మరియు పాత వరంగల్ జిల్లాలో 30 నుండి 35 లక్షల కింటాళ్ళ పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. ఈ మొత్తం వరంగల్ జిల్లాకి అతనే అధికారి అంటే దాదాపు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసాడు. అతను తెరమీద కనిపించడు. కానీ అన్ని తన కనుసన్నల్లోనే జరుగుతాయి. ప్రతి మిల్లు నుండి 25000/- రూపాయలు కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వసూలు చేసి అందజేసినట్లు తెలుస్తోంది. ఈ రూపంలో మరో 50 లక్షలు, మార్కెట్ సెక్రటరీలను బెదిరించి మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా వరంగల్ జిల్లాలోని ఎనుముల మార్కెట్లో CCI కొనుగోళ్లు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. రైతుల పత్తికి తేమ, క్వాలిటీ పేరుతో రిజెక్ట్ చేస్తారు. కానీ దళారుల పత్తి కి ఫుల్ రేట్ ఇస్తారు. కింటాకు 100.00 డబ్బులు తీసుకొని వారికి TR చేస్తారు రైతులకు మాత్రం TR చేయకుండా కొర్రీలు పెడతారని అంటున్నారు. నల్గొండ భద్రచలం నుండి వచ్చిన లోడ్లకు వాహనము సైజును బట్టి రూ.2000 నుండి రూ.5000 అదనం ఇలా ఎనుమాముల పరిధిలో లక్షల కుంటాల పత్తి కొని ఒక్కొక్కరు లక్షలు సంపాదించారు. ఇద్దరు ప్రధాన అధికారుల కనసనాల్లో ఈ దండా జరుగుతున్నట్లు సమాచారం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular