Monday, April 20, 2026

ఏపీలో అర్ధరాత్రి భూకంపం..

అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని మన్యం ప్రాంతం శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడిం ది. పాడేరు ఏజెన్సీతో పా టు.. సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు గిరిజన ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గాఢ నిద్రలో ఉన్న జనం, భూమికంపిం చడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.

శనివారం రాత్రి 11:31 గంటల సమయంలో అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ప్రధానంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు మండలాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు సమాచారం. ప్రకంపనల ధాటికి పలు ఇళ్లలో సామాన్లు కింద పడిపోవడంతో జనం ఆందోళన చెందారు. దాదాపు 3 నుంచి 5 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరాల ప్రకారం..ఒడిశాలోని కోరాపుట్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. భూ అంత ర్భాగంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular