బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి
పెద్దపల్లి , నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ గా ఇటీవల భారీ మెజార్టీతో గెలుపొందిన పోతరవేనీ శ్రీలత క్రాంతి,తెలుగు పండగ ఉగాదిని పురస్కరించుకొని మంథని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం చీరలు పంపిణీ చేశారు.
కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పట్ట ణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో నిత్యం శ్రమిం చే పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని శ్రీలత క్రాంతి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని వారు వాక్యానించారు.
ఉగాది పండగ సందర్బంగా సేవ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం బోయిన్ పేట్ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తున్న మంథని మున్సిపల్ పారిశుద్ద కార్మికులను గౌరవించుకొని వారికి చీరలు, దుస్తులు పంపిణి చేయడం జరిగిందన్నారు.


