హైదరాబాద్,:నిఘా న్యూస్ ప్రతినిధి: తెలంగాణలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాం ధీ జయంతి సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్టు తెలుస్తుంది, ఆ రోజున హైదరా బాద్ నెక్లెస్ రోడ్డు లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రామన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారం భించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 95 లక్షల మంది మహిళలకు ఉచితంగా చీరలను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.334 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రభు త్వం చేపడుతోంది. వీటితోపాటు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్ర మాలను కూడా ప్రారంభించనుంది ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన 599 గ్రామపంచాయతీ భవనాలు,1.399 మహిళా భవనా లు,184 అంగన్వా డి భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తుంది. సిద్దిపేటలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంటింటి కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిం చనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
19న మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ?
RELATED ARTICLES


