Monday, April 20, 2026

కొండగట్టులో హనుమాన్ భక్తుల రద్దీ

భక్తుల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు

జగిత్యాల,నిఘా న్యూస్ : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.ఈరోజు ఆదివారం కావడంతో పాటు చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో హనుమాన్ దీక్షాపరులు భారీగా ముందుగానే కొండగట్టుకు చేరుకుని స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతు న్నారు. ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసి పోయి, కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లో నిలబడుతు న్నారు.. స్వాముల జపాలతో, భక్తుల నినాదాలతో కొండగట్టు ప్రాంతం భక్తి రసంతో నిండిపోయింది. రానున్న చిన్న జయంతి వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ఏర్పాట్లను మరింత వేగవంతం చేశారు. ఈవో అంజనా రెడ్డి, పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు తాగునీరు, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లు కొనసాగుతు న్నాయి. మొత్తం మీద కొండగట్టు క్షేత్రం పండుగ వాతావరణంలో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలోనే కొండగట్టు దేవాదాయ శాఖ ఆదివారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది, ప్రతి పౌర్ణమి సందర్భంగా భక్తితో వైభవంగా నిర్వహించే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చోటు చేసుకు న్నాయని తెలిపారు. ఆలయ పూజారి శ్రీ రామదాసు సురేష్, ఆత్మ రావు మహారాజు, ఆధ్వర్యంలో జరిగే గిరిప్రదక్షిణ కార్యక్రమం మొదట ఏప్రిల్1వ తేదీన నిర్వహించాలనుకున్న ప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 2వ తేదీకి మార్చి నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular