హైదరాబాద్, నిఘా న్యూస్:నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతుంది తెలంగాణ రాష్ట్ర డిజీపీ కార్యాలయం లో కానిస్టేబుల్ స్వామి, తన సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అందిన సమాచారం ప్రకారం..
గురువారం తెల్లవారు జామున సుమారు ఉదయం 5:30 గంటల సమయంలో డీజీపీ కార్యాలయం లోని వాష్‌రూమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చు కుని బలవన్మరణా నికి పాల్పడ్డారు.
కాల్పుల శబ్దం విన్న సహచర పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు సమాచా రం.ఘటన స్థలంలో పోలీసులు నిర్వహిం చిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది.
ఆ నోట్‌లో తన భా ర్య, పిల్లలను ఎవరూ తప్పు పట్టవద్దని, వారు చాలా మంచి వారని స్వామి పేర్కొ న్నారు. అంతేకాకుం డా, నేను చనిపోయి దయ్యం అయినా కూడా నా భార్య, పిల్లలను చూసుకుం టాను అంటూ భావో ద్వేగ పూరితంగా రాశారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబం ధిత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.


