హైదరాబాద్, నిఘా న్యూస్:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై టీ కాంగ్రెస్ ఆ దిశగా జోరు పెంచుతుంది, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పార్టీ కార్యాచరణ ప్రకటించారు.గాంధీభవన్‌లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమా వేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, విష్ణునాథ్, విశ్వనాథం హాజరు కానున్నారు.
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ జరగ నుంది. ఈ సందర్భంగా మంత్రుల తో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమా వేశం నిర్వహించనున్నారు.
టీపీసీసీ చీఫ్. ఆ తర్వాతి రోజైన 16వ తేదీ మధ్యా హ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్‌ల సమావేశం జరగనుంది.ఈ సమీక్ష సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు..


