కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సరిల్ల రతన్ రాజుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన బ్యాంకు ఎన్నికల్లో ఆయన 306 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్సాహంగా సాగిన ఎన్నికల్లో సభ్యుల మద్దతుతో రతన్ రాజు విజయం సాధించడం విశేషం. ఈ ఫలితంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.
విజయం అనంతరం సరిల్ల రతన్ రాజు మాట్లాడుతూ .. “ఈ విజయం సభ్యుల విశ్వాసానికి ప్రతీక. అర్బన్ బ్యాంకును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. పారదర్శకత, సేవ ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతాం” అని తెలిపారు. ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, బ్యాంకు సభ్యులు, వ్యాపారవేత్తలు మరియు వివిధ వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.


