హైదరాబాద్, నిఘా న్యూస్: కారు సైడ్ అద్దానికి బైక్ తాకిందనే కోపంతో ఓ డ్రైవర్ బైకు ను వెంబడించి మరి కారుతో ఢీకొట్టాడు దీంతో బైక్ పై ఉన్న దంపతులు కింద పడి గాయాల పాలయ్యారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు..
నగరంలోని బోర బండకు చెందిన రాజశేఖర్ రెడ్డి,అనే వ్యక్తి తన భార్య వసుంధరను రాయదుర్గంలోని కార్యాలయంలో దింపేందుకు ఈనెల 7న ఇంటి నుంచి బైక్ పై బయలుదేరారు. అయ్యప్ప సొసైటీ సమీపంలో ఫ్రీ లెఫ్ట్ తీసుకుంటుండగా బైకు ముందు వెళ్తున్న ఓ కారు సైడ్ అద్దానికి స్వల్పంగా తాకింది,
కారు అద్దానికి బైక్ తాకిందనే కక్షతో కారు డ్రైవర్ బైకును వెనుక నుంచి వెంబ డించి ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిన బైక్ ముందున్న మరో కారు ను ఢీ కొట్టి కిందపడిపోయింది, దీంతో బైక్ పై ఉన్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.


