Tuesday, September 22, 2026

అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

అదిలాబాద్ , కలం నిఘా న్యూస్ ప్రతినిధి: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ ఎన్ సి యూ, వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారి గా ఏ/సి పేలడంతో వార్డ్ అంత పొగలు కమ్ముకున్నాయి, దీంతో పిల్లల తల్లి దండ్రులు ఆందోళన కు గురై తమ పిల్లల ను తీసుకొని బయ టకు పరిగెత్తారు.

ఈ ఘటనలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని శాంతినగర్ కు చెందిన 5 రోజుల శిశువుతోపాటు మరో చిన్నారి మృతి చెందారు. సిబ్బంది వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేసి అందులోని పిల్లలను పక్కవార్డుకు తరలిం చారు. గాయాలైన 27 మంది పిల్లలను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు తర్వాతే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపా రు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చా రు.ఈ దురదృష్టకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా ఎస్ఎన్‌సీయూలోని ఎలక్ట్రికల్ వ్యవస్థ, ఏసీ పరికరాలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనే కోణంలో దర్యాప్తు సాగనుంది. ఈ మరణాలకు సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా కారణమా? అనే అంశాన్ని కూడా తేల్చనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు శిశువులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబా లకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపా రు. ఈ ఘటనలో ప్రభావితమైన మిగతా చిన్నారులం దరికీ అత్యుత్తమ వైద్యం అందించాల ని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular