Friday, September 18, 2026

తుపాకి మిస్ ఫైర్.. రిజర్వు ఇన్స్పెక్టర్ మృతి

నిజామాబాద్, నిఘా న్యూస్ ప్రతినిది : నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్,హెచ్. సతీష్,దుర్మరణం చెందారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున విధులు ముగించుకుని ఉదయం హెడ్ క్వార్టర్స్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవ శాత్తు తుపాకి పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహు టిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిం చారు. అనంతరం ఆర్ఐ సతీష్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబా ద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular