నిజామాబాద్, నిఘా న్యూస్ ప్రతినిథి: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు 26 నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యా డు, గురువారం సాయంత్రం ఆర్ఆర్ చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట కారులో మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చిన వైష్ణవి అన్న సంతోష్ కారు నుంచి దిగి కత్తితో హరిబాబును విచక్షణ రహితంగా పొడిచాడు. పది సెకండ్ల వ్యవధిలో తొమ్మిది సార్లు పొడవుగా హరిబాబు రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
చిత్తరి హరిబాబు, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్‌లో హరిబాబును తానే హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ పేర్కొంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని ఈ వీడియోలో అతడు తెలిపాడు.నిజామాబాద్ నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మక్కబుట్టలు అమ్ముకుంటున్న సమయంలోఈ దాడికి గురయ్యాడు.
గత కొన్ని రోజులుగా తన తల్లితో కలిసి నిజామాబాద్ ఐదో ఠాణా పరిధిలోని ఇంద్రాపూర్‌లో నివా సం ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే మక్కబుట్టలు విక్రయి స్తున్న సమయంలో దాహం వేయడంతో సమీపంలోని చాట్‌బండి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో కారులో వచ్చిన వైష్ణవి అన్న అతడిపై దాడి చేశా డు పదునైన ఆయు ధంతో హరిబాబు తల,చాతి భాగంలో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక క్కడే మృతి చెందాడు.
ఘటనకు సంబం ధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ల్లో నమోదయ్యాయి. కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు వీడియో దృశ్యాల ఆధారంగా తెలుస్తుంది. వైష్ణవి అన్ననే కారు నుంచి దిగి హరిబాబుపై దాడి చేసినట్లు దృ శ్యాల్లో కనిపించింది. ఘటన అనంతరం సమాచారం అందు కున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జీజీహెచ్ మార్చురీకి తరలించారు.


