హైదరాబాద్, నిఘా న్యూస్ ప్రతినిది : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల మార్పుపై పార్టీలో చర్చ మొదలైంది. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సుమారు పది నెలల పాటు విదేశాలకు వెళ్లి ఆర్థిక శాస్త్రం విభాగానికి సంబం ధించిన ఉన్నత విద్య అభ్యసించేందుకు రెడీ అవుతుంది, ఈ నేపథ్యంలో ఆమె ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకొంటు న్నారు. ఈ నెల 18న ఆమె పార్టీ బాధ్యతల నుంచి వైదొలగను న్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న లండన్ కు ప్రయాణం అవు తున్నట్లు వెల్లడించా యి. వాస్తవానికి ఈ కోర్సులో చేరేందుకు ఆమెకు కొద్ది నెలల కిందటే సీటు వచ్చి నా.. ఆర్థిక స్థోమత లేక చేరలేదని సమాచారం.తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కాలర్ షిప్పూ మంజూరు చేయడం తో ఆ కోర్సులో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు చెప్పేశారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితుడు ఎస్. చెల్ల కుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ముకుల్ వాస్నిక్, తోపాటు.. పార్టీ సీనియర్ నేత శక్తి సిన్హా గోహిల్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కడిక్కున్నిల్ సురేష్ పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖ రులోగా తెలంగాణకు కొత్త ఇన్చార్జిని నియమించనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం.


