హైదరాబాద్, నిఘా న్యూస్: మేడ్చల్ జిల్లా నాగోల్ పోలీసు స్టేషన్ పరిధి లోని బండ్లగూడ ప్రాంతంలో రౌడీ షీటర్ నయీమ్ ను కొంతమంది దుండ గులు సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణ భయంతో పక్కనే ఉన్న సుప్రీం వైన్స్ లోకి అతను వెళ్లిన దుండగులు వదలలేదు ఆ వైన్స్ లోనే దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు.
అనంతరం నిందితు లు అక్కడి నుంచి కారులో పరారయ్యా రు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నా రు. పరిస్థితిని పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్య కు గురైన వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్ గా పోలీ సులు గుర్తించారు.
ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తు న్నామని, నిందితులు ఉపయోగించిన కారు ఆచూకీ కోసం, వారిని పట్టుకునేం దుకు ప్రత్యేక బృం దాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


