హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఖైరతా బాద్ మహాగణపతి తొలి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి’గా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తొలి రోజు నుంచి మహాగణపతి ని దర్శించుకోవడా నికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ ఘనంగా తొలిపూజ కార్యక్రమం!
ఖైరతాబాద్ గణనా థుడికి రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తొలిపూజ నిర్వహిం చారు. ఈ తొలిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పూజ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పా ట్లు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యా ప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపా లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
ఉత్సవాలు ప్రశాంతం గా, విజయవంతంగా జరగాలంటే భక్తుల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన కోరారు.


