హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈనెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి, కాగా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు శాసనసభలో ప్రజా విశ్వాసం బిల్లు ను ప్రవేశపెట్టింది,
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జన్ విశ్వాస్ చట్టం తరహా లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకు వచ్చింది, ప్రజా విశ్వాసం చట్టం బిల్లును మంత్రి శ్రీధర్ బాబు, శనివారం శాసనసభలో ప్రవేశ పెట్టారు.
రాష్ట్రంలో వ్యాపారా ల నిర్వహణ సులభ తరం చేయడం, పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అంతేకాకుండా నమ్మకమైన పాలన ను అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.


