Friday, September 18, 2026

ఖైరతాబాద్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్

హైదరాబాద్, నిఘా న్యూస్: వినాయక చవితి వేడుకల్లో భాగంగా అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ మహా గణేషుని దర్శనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ జెయింట్ కమిషనర్ డి,జోయెల్ డేవిస్, స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న పోలీసులు, ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ప్రధాన రహదారులపై వాహ నాల రాకపోకలను నియంత్రిస్తూ ప్రత్యా మ్నాయ మార్గాలను కేటాయించారు.

వాహన మార్గాలు..

భక్తుల రద్దీని బట్టి పోలీసులు పలు ప్రాంతాలలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు పంపిస్తున్నారు. పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాజ్ దూత్ లైన్ ద్వారా ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తున్నారు. ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలు మింట్ కాంపౌండ్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లా లని సూచించారు.

అదేవిధంగా నెక్లెస్ రోటరీ వైపు నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనా లను సెక్రటేరియట్ జంక్షన్ అలాగే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తున్నారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను ఖైర తాబాద్ పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ వైపు దారి మళ్లిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular