Friday, September 18, 2026

విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే ఘనత ఉపాధ్యాయులదే!

ఉత్తమ ఉపాధ్యాయులకు దళిత ప్రజా సంఘాల ఘన సన్మానం

మంథని, నిఘా న్యూస్:విద్యార్థుల భవిష్య త్తును తీర్చిదిద్దడం లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలక మని దళిత ప్రజా సంఘాల నాయకు లు అన్నారు. ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుందని అన్నారు.

ఈ నెల సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందు కున్న దళిత సామా జిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు సీహెచ్. పోచయ్య, బహుత్ కిషోర్లను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో శాలు వాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకో వడం గర్వకారణ మని, ఉపాధ్యాయు లు అందించిన సేవలకు లభించిన గుర్తింపుగా ఈ పుర స్కారాలను భావిం చాలని, అవార్డులతో ఉపాధ్యాయులపై బాధ్యత మరింత బాధ్యత పెరిగింద న్నారు.

విద్యార్థులకు విద్య తో పాటు నైతిక విలువలను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మరింత అంకితభా వంతో పనిచేయాలని కోరారు. తరగతి గదు ల్లో ఉపాధ్యాయుని పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఉపాధ్యాయుల నిజమైన విజయమ ని, సమాజ నిర్మాణం లో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయ మని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేల్పుల గట్టయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మంథని లక్ష్మణ్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం మంథని మండల అధ్యక్షులు కర్ణ కృష్ణ, దళిత నాయకులు కాసిపేట వెంకట స్వామి, కనుకుట్ల స్వామి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular