హైదరాబాద్, నిఘా న్యూస్ : పశ్చిమ బెంగాల్లో కలకలం రేపిన భారీ బొగ్గు కుంభకోణం, అక్రమ నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి ఈడి అధికారులు ఢిల్లీ, జార్ఖండ్, కోల్ కత్తా,లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఇందులో భాగంగా హైదరాబాదులో ప్రముఖ ఏఎంఆర్ గ్రూప్ సంస్థ కార్యాల యాలు దానికి సంబంధించిన కీలక వ్యక్తుల నివాసాలలో ఈడీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించడం రాజకీయ,వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశ మైంది,
కోల్ కత్తా నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందం స్థానిక అధికారులతో కలిసి హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టాయి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ లో ఉన్న ఏఎంఆర్ కంపెనీలో ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు.
మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మళ్లింపు పై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది.


