హైదరాబాద్, నిఘా న్యూస్ : హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా కత్తుల తో పోడిచి హత్య చేశారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంజయ్య నగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో శశిధర్ (43) వంటమనిషిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శివ బాలాజీ హాస్టల్‌లో ప్రమోద్ అనే వ్యక్తి చాఫ్‌గా పనిచేస్తున్నా డు. గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఏదో విషయంపై చిన్న గొడవ జరిగింది.వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ప్రమోద్ కత్తితో శశిధర్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తిపోట్ల తో తీవ్రంగా గాయ పడిన శశిధర్ అక్కడి కక్కడే మృతి చెందా డు. సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా డుమురియా మండలం సరాధా గ్రామానికి చెందిన శశిధర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితు డిగా అనుమానిస్తు న్న ప్రమోద్ స్వస్థలం బాలేశ్వర్ జిల్లా బెల్గోనియా గ్రామంగా గుర్తించారు. అసలు ఈ హత్యకు కారణం ఏమిటి? శశిధర్, ప్రమోద్ మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? హత్యకు ముందు ఇద్దరి మధ్య ఏం జరిగింది? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
మెన్ హాస్టల్ లో వ్యక్తి దా*రుణ హ*త్య?
RELATED ARTICLES


