పెద్దపల్లి, నిఘా న్యూస్:ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు అన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యం లో గురువారం పెద్దపల్లిలోని శ్రీనివాస గార్డెన్స్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రుల కోసం జిల్లా స్థాయి అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.
కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్ అవకాశాల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమ లు చేస్తోందన్నారు. పిల్లలను పరిమితు లతో చూడకుండా, వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిం చాలని సూచించారు.
తల్లిదండ్రులు ప్రేమ, ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహంతో పిల్లలను ముందుకు నడిపించాలని కోరారు. ఈ సంద ర్భంగా అంజారెడ్డి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినప్ప టికీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితం లో ముందుకు సాగిన తన ప్రయాణాన్ని వివరించారు.
ఆయన మాటలు తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చాయి. రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా ఉన్నత విజయాలు సాధించగలరన్నారు.
అపోలో ఆసుపత్రుల బాల వైద్య నిపుణులు డా. ఏ. జగదీష్ పిల్లల శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ అభి వృద్ధికి సంబంధించిన అంశాలపై అవగా హన కల్పించారు. అభివృద్ధి సమస్య లను ప్రారంభ దశ లోనే గుర్తించి అవసరమైన చికిత్స, శిక్షణ అందించాలని సూచించారు.
కార్యక్రమంలో ఐఈ సమన్వయకర్త జి. కవిత, ప్రణాళిక సమన్వయకర్త చేపూరి మల్లేష్ గౌడ్, మండల విద్యాధికారులు, అధికారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


