ఫామ్ హౌస్ వద్ద 144 సెక్షన్ అమలు
సిద్దిపేట, నిఘా న్యూస్ : గజ్వేల్ నియోజక వర్గంలోని ఎర్రవెల్లి లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు దిగింది ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి పిలుపు నిచ్చింది, ఈ నేప థ్యంలో 144 సెక్షన్ విధించింది పోలీసు లు భారీగా భద్రతను మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు ఎవరిని అనుమతిం చడం లేదు అటు వైపు అన్ని మార్గాల ను భారీ కేడ్లతో మూసివేశారు దీంతో ఫామ్ హౌస్ చుట్టు పోలీసులు పహారా కాస్తున్నారు. దళిత కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో ముట్టడికి వస్తుండటంతో అన్ని దారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో సిద్ధిపేట జల్లా గజ్వేల్ లో టెన్షన్ నెలకొంది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిం చిన అనంతరం మాత్రమే పోలీసులు ఆ రహదారిలో ప్రయాణానికి అనుమతిస్తున్నారు.


