Saturday, September 19, 2026

నేటి నుంచి తెలంగాణలో స్పెషల్ టెట్ పరీక్షలు

హైదరాబాద్, నిఘా న్యూస్: సెప్టెంబర్ 08తెలంగాణలో ఇన్- సర్వీస్ ఉపాధ్యాయు ల బోధ‌నా అర్హ‌త‌ కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష,టెట్ షెడ్యూల్‌ ను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికిగాను ఈరోజు, రేపు ఈ పరీ క్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి.ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక టెట్ ప‌రీక్ష‌ల‌ కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలను ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 వరకు వివిధ సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.సెప్టెంబర్ 8న ఈరోజు పేపర్-1, పేపర్-2 తెలుగు, ఇంగ్లీష్ మీడియం పరీక్షలు నిర్వహి స్తారు. సెప్టెంబర్ 9న మిగిలిన మాధ్యమా లకు సంబంధించిన పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, సంబంధిత పాఠశాలల్లో పనిచేస్తూ.. ఇప్పటికీ నిర్దేశిత అర్హత ప్రమా ణాలను సాధించని ఉపాధ్యాయుల కోసమే ఈ ప్రత్యేక టెట్‌ను నిర్వహించ నున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular