ఆదిలాబాద్, నిఘా న్యూస్: ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది.
శిక్షణ కై ఏర్పాటు చేసిన పరీక్షలో దాదాపు 3,500 మంది విద్యార్థులు హాజరుకాగా అందు లో దాదాపు 300 మందిని ఎంపిక చేసి ఈ రోజు నుండి శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణకు 300 మందికి పైగా అభ్యర్థులు ఎంపిక కాగా, 100 మంది నిరుపేదలకు, ఆదివాసీ యువతకు ప్రత్యేక అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యం తో ఉన్న అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కలల ను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.
కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికీ విజయం సాధించే అవకాశం ఉంటుందని, హార్డ్ వర్క్‌తోనే ఉద్యోగ సాధన సాధ్యమవు తుందని తెలిపారు. హైదరాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి నిష్ణాతులైన అధ్యాపకుల బృందం తో అభ్యర్థులకు నాణ్యమైన ప్రాథమిక పరీక్ష శిక్షణ అంది స్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో ప్రతిరోజు మరియు వారాంత పరీక్షలను నిర్వహి స్తూ అభ్యర్థులకు మరింత కఠినంగా శిక్షణను అందిస్తు న్నట్లు తెలిపారు. మొదటగా అభ్యర్థు లందరూ ప్రాథమిక పరీక్ష లో ఉత్తీర్ణత సాధించేలా చదవా లని తెలిపారు.
ప్రతిరోజూ బోధించిన పాఠ్యాంశాలను పున శ్చరణ చేసుకుంటూ, క్రమశిక్షణతో చదు వుపై దృష్టి సారిం చాలని సూచించారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలు సాధించే లా కృషి చేయాలని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.


