బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో బర్తరఫ్ చేశారు..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు
కరీంనగర్, నిఘా న్యూస్: నాడు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు, విద్యార్థులను పట్టించుకోకుండా.. నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సమరభేరి సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని, యువత బీఆర్ఎస్ను ఎప్పుడో తిరస్కరించిందని అన్నారు.ఆదివారం మీడియాతో రాజేందర్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఎవరి వారసత్వంతోనో రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందిన నాయకుడు కాదని, జెడ్పీటీసీ స్థాయి నుంచి స్వయంకృషి, పట్టుదల, కమిట్మెంట్తో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత అని పేర్కొన్నారు.
“రేవంత్‌రెడ్డి కాళ్ల గోటికి కూడా కేటీఆర్ సరిపోరు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మరోసారి రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు.దమ్ముంటే కేసీఆర్‌తో రాజీనామా చేయించుకేటీఆర్కు నిజంగా దమ్ముంటే తన తండ్రి కేసీఆర్‌తో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయించాలని రాజేందర్రావు సవాల్ విసిరారు. “దమ్ముంటే నీ తండ్రి కేసీఆర్‌ను ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయించు. ఆ పదవిని బీసీ లేదా ఎస్సీ ఎమ్మెల్యేకు ఇవ్వండి. ఆ సాహసం చేసే దమ్ముందా కేటీఆర్? సమాధానం చెప్పు” అని నిలదీశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చురుగ్గా పోరాడాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు సరిగా హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేకు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు దాదాపు కోటి 20 లక్షల వేతనం తీసుకొని ఫామ్ హౌస్ లో పడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమైన నేతగా కేసీఆర్ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారని రాజేందర్రావు విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులను పక్కనపెట్టి కుటుంబానికి, అనుచరులకు పెద్దపీట వేసిన చరిత్ర బీఆర్ఎస్దేనన్నారు.“అమెరికాలో ఉద్యోగం చేసుకున్న మీరు.. మీ బాపు కేసీఆర్ అండతో బీఆర్ఎస్లోకి వచ్చారు. కేసీఆర్ లేకుంటే పార్టీలో కేటీఆర్‌ను ఎవరు పట్టించుకునేవారు?” అని ప్రశ్నించారు.నిరుద్యోగుల విషయంలో కేటీఆర్ సమాధానం చెప్పాలిబీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకు కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పాలని రాజేందర్రావు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, 317 జీవో, స్వయం ఉపాధి పథకాలపై యువతకు కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, పేపర్ లీకేజీలపై అప్పటి ప్రభుత్వ వైఫల్యాలకు కేటీఆర్ వహించాలని అన్నారు. “అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వెయ్యి అబద్ధాలతో ప్రచారం చేయడం ఎందుకు? నాడు నిరుద్యోగులను మోసం చేసి.. నేడు మొసలి కన్నీరు కార్చడం ప్రజలంతా గమనిస్తున్నారు” అని అన్నారు.70 వేల ఉద్యోగాలు కనిపించడం లేదా?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని రాజేందర్రావు పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసేందుకు సిద్ధమవుతుంద న్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం మిస్టర్ కేటీఆర్‌కు కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు.కరీంనగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సమరభేరి సభ పూర్తిగా విఫలమైందని రాజేందర్రావు అన్నారు.
యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్.. ఇప్పుడు యువత కోసం సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు.డ్రగ్స్ అంశంపై కేటీఆర్ యువతకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని సూచించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పడం మాత్రమే కాకుండా.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని చెప్పే నైతిక ధైర్యం చూపాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని రాజేందర్రావు అన్నారు. “ప్రజలు బీఆర్ఎస్ను ఎప్పుడో తిరస్కరించారు. పిండం పెట్టారు. ఇప్పుడు ఎన్ని సభలు పెట్టినా యువత విద్యార్థులు మహిళలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నాడు మోసం చేసి.. నేడు మొసలి కన్నీరు కార్చినా తెలంగాణ యువత బీఆర్ఎస్ను క్షమించదు” అని రాజేందర్రావు స్పష్టం చేశారు.


