హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఈరోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వ హించే బహిరంగ సభ ప్రభుత్వ100 పడకల ఆసుపత్రి ప్రారంభో త్సవం ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అన్ని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా సభ ప్రాంగణంలో చేపట్టా ల్సిన ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజలకు కల్పించాల్సిన తాగునీరు, పార్కింగ్, భద్రత, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలపై సంబం ధిత అధికారులకు, మున్సిపల్, పోలీస్, శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
నకిరేకల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడం తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహ నాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్న ట్లు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.
ప్రజలు తమ వాహనాలతో తిప్పర్తి సర్వీస్ రోడ్డు నుంచి దిగి ఇందిరాగాంధీ సెంటర్ మీదుగా సభ ప్రాంగణానికి చేరుకో వాలని పోలీసులు సూచించారు.


