హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చేయూత పింఛన్ల పథకానికి దరఖాస్తు చేసుకునే సమయం చివరి దశకు చేరుకుంది. నూతన పింఛన్ల కోసం అప్లై చేయడా నికి ప్రభుత్వం నిర్ణయించిన తుది గడువు నేటితో ముగియనుంది.
అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని లబ్ధిదారు లు వెంటనే తమ వివరాలను సమర్పిం చాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా లక్షలాది మందికి విడతలవారీ గా ఈ పింఛన్లు అందజేసేం దుకు ప్రభుత్వం కసర త్తు పూర్తి చేసింది.
ఈ పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత- గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలతో పాటు వైకల్యం లేదా సంబంధిత వైద్య ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.
అయితే గతంలోనే ‘ప్రజా పాలన’ లేదా గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంకా దరఖాస్తు చేయని అర్హులు వెంటనే తమ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, వార్డు ఆఫీస్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించవ చ్చు.


