హైదరాబాద్, నిఘా న్యూస్ :భాగ్యనగర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అర్థరాత్రి వేళల్లో ప్రజా రవాణా కు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి రాత్రి పూటకూడా ఆర్టీసీ సేవలను ప్రారంభిస్తు న్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్ నగరం లో ప్రస్తుతం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకే ఆర్టీసీ బస్సులు అందుబా టులో ఉంటున్నాయి. అర్ధరాత్రి దాటాక డ్యూటీలు ముగించు కుని ఇళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల కార్మికులు రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి అర్ధరాత్రి వేళ నగరానికి చేరుకునే ప్రయాణికులు సొంత ఇళ్లకు వెళ్లడానికి ప్రైవేట్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిం చి వేలకు వేలు తగలే యాల్సి వస్తోంది. ప్రయాణికుల ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం నిరంతర బస్సు సర్వీసులను అందుబాటులోకి తేనుంది. కోఠి, సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు రూట్లలో సమయాలు ప్రధాన రద్దీ ప్రాంతా లను అనుసంధాని స్తూ ఆర్టీసీ ఈ నైట్ సర్వీసులను ప్రవేశపెడుతోంది. కోఠి నుంచి పటాన్‌చెరు (222A) రూట్‌లో మొత్తం నాలుగు బస్సులు తిరుగుతా యి. కోఠి నుంచి తొలి బస్సు రాత్రి 11.40 గంటలకు బయలు దేరుతుంది. చివరి బస్సు తెల్లవారుజామున 4.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు (219) మార్గంలో మొదటి సర్వీస్ రాత్రి 11.20 గంటలకు, చివరి సర్వీస్ తెల్లవారు జామున 3.00 గంట లకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
సెప్టెంబర్ 1 నుంచి నైట్ షిఫ్ట్ బస్సులు ప్రారంభం
RELATED ARTICLES


