హైదరాబాద్, నిఘా న్యూస్: నీట్ పేపర్ లీకేజీలు పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో విద్యార్థి సంఘా లు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి, దీంతో హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లా లోని పాఠశాలలు శుక్రవారం సెలవు ప్రకటించాయి.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపు నిచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే ఈ మేరకు ఎస్ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్,సహా పలు విద్యార్థి సంఘా లు ఈ బంద్కు మద్దతు ప్రకటించా యి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్కు సహకరించాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.
జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్ టి ఏ,ను రద్దు చేయాలని డిమాండ్.
పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణ లు వచ్చిన అక్రమాల పై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.


