Thursday, July 23, 2026

పశువుల సంతను తలపిస్తున్న మంథని అంబేద్కర్ చౌక్

నిఘా న్యూస్, పెద్దపల్లి :పశువులను రోడ్లపై యథేచ్ఛగా వదిలివే స్తుండడంతో వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు. పశువుల యజ మానులు వాటిని పట్టించుకోక పోవడం తో రాత్రివేళల్లో సైతం రోడ్లపైనే సేదతీరుతు న్నాయి. దీంతో పగటి పూటతో పాటు… రాత్రి వేళల్లో ప్రయాణం సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, తో పాటు, బస్టాండు ప్రాంతంలో నిత్యం పశువులు రోడ్లపైనే సంచరించడం వల్ల పశువుల సంతను తలపిస్తుంది, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లుపై యధాత్చం గా పశువులు ప్రధాన రోడ్లపై తిరుగుతున్న మున్సిపల్ అధికారు లు ఏ మాత్రం పట్టిం చుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తు న్నారు. వాటి వల్ల స్థానికులకు వాహనదారులకు ప్రజలకు ప్రాణసంక టంగా మారుతోంది. ఒక్కొక్కసారి ద్విచక్ర వాహనదారులు వాటిని తప్పించే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడి ఆసుత్రులపాల వుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ.. పక్క నుంచి వెళ్లే వాహదారులపై పడుతుండడంతో ప్రమాదాలు జరుగు తున్నాయి. ఇప్పటికై నా మునిసిపల్ అధి కారులు స్పందించి వెంటనే పశువుల యజమానులకు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకో వాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular