హైదరాబాద్, నిఘా న్యూస్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుక ల్లో పాల్గొననున్నారు.
ఈనెల 26 ఉ. 11: 35 గ. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరునున్నారు.మ. 12:45 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుని 12:50 గంటలకు హెలికాప్టర్ లో కరీంనగర్‌కు బయలుదేరి రానున్నారు.
మ. 1:45 గ. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెలి ప్యాడ్‌కు చేరుకుంటా రు. మ. 1:55 గంట లకు ప్రతిమ ఇన్స్టి ట్యూట్ కార్యక్రమ వేదికకు చేరుకుం టారు. మ. 2:00 నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం తరువాత..
మ. 2:30 నుంచి 3:45 గంటల వరకు ప్రతిమ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటా రు. సాయంత్రం 4:00 గంటలకు హెలికాప్ట ర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సా. 5:00 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.


