Tuesday, July 21, 2026

జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జేఎస్ఎస్ వినతి

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (జేఎస్ఎస్) రాష్ట్ర కమిటీ సభ్యులు బుధవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సంక్షేమ, గుర్తింపు కార్డులు, ఆరోగ్య భద్రత, గృహ స్థలాలు, ఇతర వృత్తిపరమైన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు జేఎస్ఎస్ నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని జేఎస్ఎస్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సమస్యలను ఓర్పుగా విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాటిని పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం (జేఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్‌తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular