హైదరాబాద్, నిఘా న్యూస్: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం లోఈ తెల్లవారుజాము న వరస భూప్రంకనలు సంభవించాయి. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. రాష్ట్రం లోని నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
ఈ హఠాత్ పరిణా మంతో స్థానికులు వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఏదో అనర్థం ముంచుకొస్తోందనే భయంతో వణికిపో యారు.మొదటి భూకంపం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:37 నిమిషాలకు సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా రికార్డయింది.
రెండు గంటల తర్వాత అంటే వేకువ జామున 3:23 నిమిషాల సమ యంలో మరోసారి భూమి ప్రకోపించింది. దీని తీవ్రత 4.1 గా నమోదైంది. హింగోళి సమీపంలో 19.589 అక్షాంశం, 77.156 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.
ఈ భూప్రకంపనల తీవ్రత తక్కువే అయినప్పటికీ, గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డా రు. ఇళ్లలోని పాత్రలు నేలపై పడటం, గోడ గడియారాలు, కిటికీ తలుపులు ఊగడం వంటి పరిణామాలు గమనించిన ప్రజలు తీవ్ర భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణరక్షణ కోసం మహిళలు, చిన్న పిల్లలతో సహా అందరూ రోడ్ల మీదే గడిపారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రకంపనల వల్ల ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరైనా గాయ పడటం కానీ జరగలే దని అధికారులు ధృవీకరించారు.


