Wednesday, July 29, 2026

తగ్గేదేలే అంటున్న చికెన్ ధరలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటు న్నాయి. ఆదివారం రోజున కిలో స్కిన్ లెస్ చికెన్ రూ” 350 నుంచి 360 వరకు, బోన్ లెస్ చికెన్ రూ” 640 వరకు అమ్ముతున్నారు. ఎండాకాలంలో రూ” 300 వరకు పలికిన చికెన్ ధరలు వర్షాలు పడ్డాక తగ్గుతాయని భావించగా నేడు ఆ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది.

సాధారణంగా వాన కాలంలో తగ్గే చికెన్ ధరలు ఈసారి మాత్రం పెరుగుతూ నే ఉన్నాయి. కోడిగుడ్ల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇటీవల వరకు రూ.80లోపు దొరికిన డజను గుడ్లు.. ఇప్పుడు రూ.90 నుంచి 100 వరకు చేరుకున్నా యి. ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.8.50 మధ్య పలుకుతోంది.

దీంతో ప్రతిరోజూ గుడ్లు వినియోగించే కుటుంబాలు ఖర్చు ను తగ్గించుకునే పరిస్థితి ఎదుర్కొం టున్నాయి.వేసవి కాలం తర్వాత కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం, మార్కెట్‌ లో సరఫరా తగ్గిపో వడం ధరల పెరుగు దలకు ప్రధాన కార ణాలుగా వ్యాపారు లు చెబుతున్నారు.

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, శుభకార్యాల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడంతో కూడా ధరలు మరింత ఎగబాకుతున్నాయని అంటున్నారు. మార్కెట్‌లో కొంత మంది వ్యాపారుల ఆధిపత్యం కూడా ధరలపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular