హైదరాబాద్, నిఘా న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. శుక్రవారం భారత్ చేరుకున్న ఆమె, ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శిం చి,అందుకు సంబంధిం చిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పర్యటనలో భాగంగా ఆదివారం టిఫానీ ట్రంప్, ఆగ్రాకు వెళ్లను న్నారు. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించనున్నా రు. అక్కడ నుంచి ఆమె రాజస్థాన్ లోని జైసల్మేర్ లో కూడా పర్యటించనున్నట్లు తెలుస్తుంది, ఇది ఆమె వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ముం దు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
కాగా టిఫానీ, భారత కు రావడం ఇది తొలి సారి కాదు 2018లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ , భారత్ లో అధికారికంగా పర్య టించారు. అప్పుడు తండ్రితో పాటు టీఫాని ట్రంపు, కూడా ఇక్క డికి వచ్చారు. ఈమె ట్రంపు రెండో భార్య కుమార్తె.


