Saturday, May 30, 2026

వంతెన కూలి ఆరుగురు కార్మికులు మృతి!

హైదరాబాద్, నిఘా న్యూస్: తుఫాన్ కారణంగా శుక్రవారం తెల్లవారు జామున పెను ప్రమా దం చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో అత్యంత విషాదకర మైన ఘటన జరిగింది, బెట్వా నదిపై నిర్మాణం లో ఉన్న ఒక భారీ వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయా రు. ఈ ఘోర ప్రమా దంలో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హమీర్‌పూర్ జిల్లా కురారా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్కందర్ పర్సాని నుండి నైతి గ్రామం వరకు బెట్వా నదిపై కొత్త వంతెన నిర్మాణం జరుగుతోం ది. ఎప్పటిలాగే కార్మికులు గురువారం రాత్రి సమయంలో కూ డా పనుల్లో నిమగ్నమ య్యారు. అయితే, శుక్రవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయిం ది. తీవ్రమైన తుఫాను, బలమైన ఈదురు గాలులు వీచాయి.

ఈ ప్రకృతి బీభత్సానికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది. వంతెనకు సంబంధిం చిన భారీ షట్టరింగ్, స్లాబ్‌లు, పిల్లర్లు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. ఆ సమయంలో వంతెన కింద, పక్కన పనిచే స్తున్న కార్మికులపై ఈ భారీ కాంక్రీట్ శిథిలాలు పడ్డాయి.

దాంతో వారు బయట కు రాలేక, అక్కడికక్క డే శిథిలాల కింద కూరుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమా చారం అందించారు. సమాచారం అందుకు న్న వెంటనే పోలీసు లు, జిల్లా యంత్రాం గం, మరియు విపత్తు నిర్వహణ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

చీకటిగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు మొదట్లో తీవ్ర ఆటంకం కలిగిం ది. అయినప్పటికీ, అధికారులు రాత్రంతా శ్రమించి జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహా యంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular