హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలోని గ్రామపంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టలాడుతున్న తరుణంలో గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. ముఖ్యంగా గ్రామాల్లో వీధి దీపాల, నిర్వహ ణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వంటి ప్రాథమిక సేవలను కొనసాగించడంలో పంచాయతీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి, కొంతకాలంగా పాలక వర్గాలేని కారణంగా గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు నిలిచిపోయాయి,
దీంతో కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రూ.9,968 కోట్ల నిధులను మంజూరు చేసింది, దీనితోపాటు ఈ నిధుల వినియో గం, పర్యవేక్షణ, పార దర్శకతపై కేంద్ర ప్రభు త్వం స్పష్టమైన మార్గ దర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామ పంచా యతీల,మౌలిక సదు పాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్‌ల ఏర్పాటు వంటి ప్రజా సేవల కోసమే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే ఈ గ్రాంట్లను ఎలాంటి పరిస్థితుల్లో నూ ప్రభుత్వ ఉద్యోగు ల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఉపయోగించరాదని ఖచ్చితమైన నిబంధన విధించింది.నిధుల దుర్వినియోగానికి తావులేకుండా ఉండేం దుకు కేంద్రం కఠినమై న పర్యవేక్షణ నిబం ధనలను తెచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు తమ వ్యయ వివరాలను ప్రజలకు అందుబా టులో ఉంచాలని పేర్కొంది.
త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని, వాటి ఆధారంగా సమగ్ర నివేదికలను రాష్ట్రం కేంద్రానికి సమర్పించా లని ఆదేశించింది. ఆడిట్‌లో ఏవైనా లోపాలు గుర్తిస్తే తక్షణమే సరిదిద్దాలని, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగి నట్లు తేలితే చట్టపర మైన కఠిన చర్యలు తీసుకోవాలని దీనిపై తగిన పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది.
ఐదేళ్ల కాలానికి ఆర్థిక సంఘం దేశం మొత్తా నికి రూ.4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రక టించింది. ఇందులో 80 శాతం నిధులు నేరుగా పంచాయతీ లకు, 10 శాతం మండ ల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిష త్‌లకు దక్కుతాయి. ఈ నిధులను ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతల్లో విడుదల చేస్తారు.
2026 నాటి అంచనా ల ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఈ లెక్కన తెలంగాణ గ్రామీణ జనాభాకు 1.92 శాతం, వైశాల్యానికి 0.37 శాతం చొప్పున మొత్తం రూ.9,968 కోట్ల నిధులు దక్కాయి.


