Sunday, May 24, 2026

బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య?

నల్లగొండ, నిఘా న్యూస్: నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం యార్కారం,బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు, దారుణ హత్యకు గురయ్యాడు.. ఆయనను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్ళుతో నరికి చంపారు. అనంతరం రెండు ముక్కలుగా చేసి మూడు గోనె సంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సా రెసీ, కాలువలో పడేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది….

పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. హత్య కు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో కొనసాగుతున్న పాత రాజకీయ విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని అనుమా నాలు వ్యక్తమవుతు న్నాయి.

చింతలపాటి మధు భార్య మౌనిక బీఆర్ఎస్ తరఫున గ్రామ సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. గ్రామ రాజకీయాల్లో వారి కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. అయితే కొంతకాలంగా గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరుకొన సాగుతున్నట్లు స్థాని కులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మధు,హత్య చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే గ్రామంలో కొన్నాళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్, హత్య కేసులో చింతలపాటి మధు, ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండ వచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును దృష్టిలో ఉంచుకొని పోలీసులు అన్నీ కోనల్లో దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస రాజకీయ హత్యలతో గ్రామంలో శాంతిభద్రతలు క్షీణిస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదు పులోకి తీసుకురావ డానికి చర్యలు చేపట్టారు.

అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమా చారం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular