Monday, May 25, 2026

హైదరాబాద్ కు చేరిన తమిళ్ రాజకీయాలు

హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది,టీవీకే పార్టీ అధినేత విజయ్, ప్రభుత్వం ఏర్పాటుకు తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే విజయ్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఇంకా సందిగ్ద కొనసాగుతూ నే ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయ్ తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్‌ అర్లేకర్‌‌ను మూడు సార్లు కలిశారు.

అయితే, పూర్తిస్థాయి మెజార్టీ లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేనని గవర్నర్ తేల్చి చెప్ప డంతో అసలు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి.టీవీకే విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, విజయ్ రెండు స్థానా ల్లో పోటీ చేయడంతో ప్రస్తుతం ఆ పార్టీకి 107 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఐదుగురు విజయ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనికితోడు సీపీఐ, సీపీఐ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చేం దుకు ముందుకొచ్చా రు. దీంతో విజయ్‌కు 116 మంది ఎమ్మెల్యే ల మద్దతు లభించిన ట్లయింది.

అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యే ల మద్దతు అవసరం. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం జరుగుతున్న వేళ క్యాంపు రాజకీ యాలకు తెరలేచింది.

టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కచూ పులు చూడకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలను హైద రాబాద్‌లోని క్యాం పుకు తరలించారు.

శనివారం ఉదయమే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరా బాద్ చేరుకున్నారు. వారికి తాజ్ కృష్ణా హోటల్ లో బస ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది, తమిళ నాడులో రాజకీయ అనిశ్చితి తొలగి పోయేంత వరకు ఆ ఐదుగురు తాజ్ కృష్ణ హోటల్ లోనే ఉండేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular