Sunday, April 19, 2026

నేటి నుంచి ఐపీఎల్ ధమాకా షురూ!

ప్రారంభంలోనే హై వోల్టేజ్ మ్యాచ్!

హైదరాబాద్, నిఘా న్యూస్: టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు జైత్రయాత్రను చూసి మూడు వారాలు గడిచాయి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించిన టీమిండియా కు మన అభిమానులంతా జేజేలు పలికారు. ఆ తర్వాత క్రికెట్ కు కాస్త విరామం లభించిన ఇప్పుడు మళ్లీ అందరిలో జోష్ నింపే వేసవి వినోదం వచ్చేసింది,కొద్ది రోజుల క్రితం వరకు ఒకే జట్టుగా టీం ఇండియన్ ఛాంపియ న్లు గా నిలిపిన సహచరు లంతా ఇప్పుడు ప్రత్యర్ధు లుగా తలపడేందుకు సిద్ధమయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నిరీక్షణ ముగిసింది. నేటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 19వ సీజన్ మొదలు కాబోతుంది. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించే ఈ లీగ్‌లో మే 24 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా..మే 31న ఫైనల్ పోరు జరగనుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,సన్‌రైజర్స్ హైదరాబాద్, మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో ఈరోజు రాత్రి 7 గంటల కు జరిగే తొలి మ్యాచ్‌ తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుం ది.గతేడాది తొలిసారి టైటిల్ ను గెలుచుకున్న ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ గా బరిలోకి దిగుతుండగా..

మరోవైపు సన్‌ రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. బీసీసీఐ ఎన్నికల తేదీలను పరిగణనలోకి తీసుకుని రెండు దశల్లో పూర్తి షెడ్యూల్‌ ను విడుదల చేసింది. 15 రోజుల పాటు సాగే తొలి దశ షెడ్యూల్ మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరగనుంది.

2022 నుండి అమలవు తున్న ఫార్మాట్ ప్రకారమే ఈ సీజన్ కూడా సాగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో సీఎస్‌కే, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఉండగా.. గ్రూప్-Bలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌ లు చొప్పున మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి.

ఇందులో తమ గ్రూప్‌ లోని మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌ లు, ఇతర గ్రూప్‌ లో తమ స్థానంలో ఉన్న జట్టుతో రెండు మ్యాచ్‌ లు, మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

టాప్-2 జట్ల మధ్య క్వాలిఫయర్-1, మూడు & నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1 లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 లో తలపడుతుంది. మే 31న జరిగే ఫైనల్ పోరులో క్వాలిఫయర్-1 & క్వాలిఫయర్-2 విజేతలు టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకుంటారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular