నిర్మల్, నిఘా న్యూస్: నిర్మల్ జిల్లాలో మంగళ వారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, బైంసా పట్టణంలోని సత్‌పూల్ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న తమ బంధువులను పరామర్శించేందుకు కారులో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కబీరు మండలం కుప్టీ గ్రామానికి చెందిన బోజరాం పటేల్ (42), రాజన్న (60), బాబన్న (70), కారు డ్రైవర్ వికాస్ (35) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


