Friday, March 6, 2026

BEL లో ఉద్యోగాలు

హైదరాబాద్, నిఘా న్యూస్:ప్రభుత్వ రంగ సంస్థ అయి న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టు ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా మరియు ఇతర రాష్ట్రాలలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31 లోపు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హత: అభ్యర్థులు పోస్ట్ ప్రకారం సంబంధిత విభాగంలో BE/BTech/BSc (మెకానికల్/ఎలక్ట్రానిక్స్/కమ్యూని కేషన్) ఉత్తీర్ణులై ఉండాలి మరియు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 1-01-2025 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. OBCలకు మూడు సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు PWDలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000

ప్రదేశాలు

మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్ ) హైదరాబాద్ (తెలంగాణ) చెన్నై (తమిళనాడు), బెంగళూరు, పూణే, ఘజియాబాద్, నేవీ ముంబై, ఉత్తరాఖండ్, హర్యానా.

దరఖాస్తు రుసుము: రూ.1000 + GST; SC/ST/PwBD అభ్యర్థులకు రుసుము నుండి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2025

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular