Friday, March 6, 2026

రేపు పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, పోలీస్ అధికారులు

పెద్దపల్లి జిల్లా, నిఘా న్యూస్:తెలంగాణలో ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే యువశక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారని రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,సభా ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం సచివాల యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, ప్రభుత్వ ముఖ్య కార్యద ర్శులు శ్రీధర్, సందీప్ సుల్తానియా, క్రిస్టినా చోంగ్తు, ఫైర్ సర్వీసుల డిజి నాగిరెడ్డి, అడిషనల్ డిజి మహేష్ భగవత్, సిఎంఒ అధికారి వేముల శ్రీనివాసులతోపాటు…

సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ హరీష్, విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సిం హా రెడ్డి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశా నికి హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువతకై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇటీవల గ్రూప్ IV లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు.

ఈ సభలోనే స్కిల్ యూని వర్సిటీలో బాగస్వామ్యమ య్యే 7 ఏజెన్సీలతో ఒప్పం ద పత్రాలను సంతకం చేయడం జరుగుతుందని,, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం, సి.ఎం కప్ ప్రారంభంలతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్య మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు.

వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు 40 స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే, వరంగల్, మహబూబ్ నగర్ లో మాదిరిగానే పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular