వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడలో దీపావళి పండుగ ఘనంగా డీఎస్పీ కార్యాలయం ముందు ఎ ఎస్పీ శేషాద్రిని రెడ్డి బాణాసంచా టపాసులు పేల్చి ఎంతో ఉత్సాహంతో పోలీస్ సిబ్బంది లతో పండగ సంబరాలు చేసుకున్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి వెలుగులు నిండాలని ప్రతి ఒక్కరు ఆనందంతో ప్రతి ఇల్లు సంతోషాలతో విజయాలని సాధించాలని దీపావళి రోజు చెడుపై మంచి సాధించిన విజయమని అందరూ సుఖసంతోషాలతో ఉండటానికి పండగలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా టపాసులు పేల్చాలని పెద్దల సూచనలు పాటించాలన్నారు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు
దీపావళి సంబరాల్లో పాల్గొన్న ఏ ఎస్పి శేషాద్రిని రెడ్డి..
RELATED ARTICLES


