Saturday, March 7, 2026

తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం… బతుకమ్మ

వేములవాడ. నిఘా న్యూస్: ఏమేమి పువ్వాప్పుడే గౌరమ్మ ,ఏమేమి కాయప్పుడే గౌరమ్మ ,బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం చివరలో అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్నీ చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సాగు చేయని , బంజరు భూములలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీ దేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగ సమయంలో గునుగు పూలు, తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మహిళలు విశేషంగా జరుపుకుంటారు. ఆడపిల్లలు బతుకమ్మ వేడుక చేసుకోవటానికి అమ్మగారింటికి చేరుకుంటారు. తొమ్మిది రోజుల పాటు పుట్టింట్లో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని పూజిస్తారు.
గంగా గౌరీ సంవాదం.. గౌరీ దేవిని పూజించేలా బతుకమ్మ
మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై గంగమ్మని పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారు అని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి గంగ మీద నిన్ను పూలతెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తానని చెబుతుంది. ఆ తర్వాత బతుకమ్మగా పార్వతీ దేవిని పూజిస్తే మహిళలు పాడిపంటలు సంవృద్దిగా పండుతాయని ప్రచారం కాగా, అలా ప్రాచుర్యంలోకి వచ్చింది బతుకమ్మ పండుగ అని కొందరు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో కరువుకాటకాలతో తీవ్ర దుర్భిక్ష నెలకొన్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా చెప్తుంటారు. ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

బతుకమ్మ పండుగ వెనుక జానపదుల కథలు
పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలు ఉంటే ఆమె పెద్ద వదిన పాలల్లో విషం కలిపి మరదలికి తాగించి చంపేసిందని, ఆ తర్వాత ఊరి బయట పాతి పెట్టిందని అక్కడ అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది అని మరో కథ కూడా ఉంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు కూల్ ఇద్దామని పోతే ఆమె ఆత్మ తన మరణం గురించి అన్నలకు చెబుతోందని అప్పుడు అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయండని చెప్పిందని, అలా ఈ పండుగ మొదలైందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇంకొక కథలో సంతానం లేని దంపతులకు ఓ బాలిక దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఇక ఆ బాలిక మహిమలు చూపిస్తూ, లోకహిత కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. బతుకమ్మగా గౌరీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది. అప్పటి నుండి బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తున్నారు అని చెప్తుంటారు
బతుకమ్మ పండుగ ప్రత్యేకత నిరుపమానం
బతుకమ్మ పండుగ జరుపుకునే నేపథ్యం ఏదైనా, బతుకమ్మ వెనుక ఉన్న చరిత్ర ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను సంతరించి, దేశ విదేశాల్లోనూ ప్రత్యేకమైన కీర్తిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. పాడిపంటలతో, సిరి సంపదలతో తులతూగాలని, మంచి వర్షాలతో వరుణదేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని, అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతుల జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగను యువతులు, ముత్తయిదువులు ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంటుంది. అందులో ముఖ్యంగా తెలంగాణా బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత అందులో బాగంగా .మొదటి రోజున ఎంగిలిపులతో బతుకమ్మ రెండో రోజున అటుకుల బతుకమ్మ , మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ,నాల్గవ రోజు ననే బియ్యం బతుకమ్మ,,ఐదవ రోజు రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ,,ఎడవరోజు వేపకాయ బతుకమ్మ,,ఎనిమిదోవ రోజు వదిన్నెముద్ద బతుకమ్మ ,తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను ,మహిళలు ,అన్ని గ్రామాల్లో వివిధ రకాలుగా ఆలంకరించుకొని బతుకమ్మ పాట రామా రామ ఉయ్యాలో ,రామన శ్రీరామ ఉయ్యాలో ,అంటూ ఒక్కేసి పువ్వేసి చందమామ, ఏడు జాములయే చందమామ, ఏమేమి పువ్వాప్పుడే గౌరమ్మ ఏమేమి కాయప్పుడే గౌరమ్మ ,ఇంక అనేక రకాల జానపద పాటలతో కోలాటం ఆటలతో ఎంతో సంబరంగా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకోగ కొన్ని గ్రామాలలో ఏడు రోజులు జరుపుకోవడానికి ఒక చరిత్ర వుంది , పూర్వం తెలంగాణా ప్రాంతాన్ని పాలించే ఒకరాజుకు అమితమైన ప్రేమ ఆమెను వేములవాడ వాస్తవ్యునికి ఇచ్చి వివాహం చేసాడని వివాహం జరిగిన మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ రావడం వల్ల కూతురుని అల్లుడిని ఇంటికి పిలి చడాని అయితే తనపుట్టి న ఊరిలో బతుకమ్మ ఆడితే అత్తగారింట్లో ఆడడం కుదరదని అనటం తో వేములవాడ ప్రాంతంలో అడబిడ్డలు ఏడూ రోజులు జరుపైకొని మిగతా రెండురోజుల బతుకమ్మ అత్తగారింట్లో జరుపుకొవలని ఆరాజు శాసించాడని ఇప్పటికీ అడబిడ్డలు చేరుకొని వేములవాడలో బతుకమ్మ పండుగ ఏడు రోజులు జరుపుతున్నారు ,చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ ఆనవాయితీ ఇప్పటికి పాటిస్తూన్నారు తెలంగాణా సంస్కృతి కి మూలమైన బతుకమ్మ పండుగ కు ప్రపంచంలోనే ఒక విశిష్ఠత స్తానం ఉంది

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular