ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కటకం మృత్యుంజయం
గంభీరావుపేట మార్చి 30 (నిఘా న్యూస్ ):కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శనివారం వారి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు, సీనియర్ పిసిసి అధికార ప్రతినిధి, కటకం మృత్యుంజయం పంతులు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి ని కలిసి సన్మానించినట్లు ఆయన వెల్లడించారు. కరీంనగర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కటకం మృత్యుంజయం పంతులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సుపరిచితుడు,


