కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయం లో అమ్మవారి సన్నిధిలో కలం నిఘా న్యూస్ ఎడిటర్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్ గాయత్రిల కుమారుడు చిరంజీవి దేవాన్ష్ కు అర్చకులు శేషు శర్మ చేతుల మీదుగా అన్నప్రాసన సంతోషంగా నిర్వహించారు, అర్చకులు శేషు శర్మ మాట్లాడుతూ “దేవాన్ష్ అన్న ప్రాసన జరిగిన సందర్భంలో దేవాన్ష్ బాబు కలం కత్తి పట్టుకోవడంతో దేశంలో పేరు ప్రతిష్టలతో పాటు బిజినెస్ వ్యవహారాలలో అగ్ర భాగాన నిలుస్తారని అన్నారు, తల్లిదండ్రులు ఆనందంతో సంతోషంలో మునిగిపోయారు, ఈ అన్నప్రాసన కార్యక్రమంలో శేషు కుటుంబ సభ్యులు మేనమామ తదితరులు పాల్గొన్నారు.

