పెద్దపల్లి, నిఘా న్యూస్ పార్టీలో పదవుల కోసం కొందరు నేతలు పట్టుబడుతున్నారు. ఓటరు సమగ్ర జాబితా సవరణ పూర్తికాగానే నామి నేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రక టించడంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆధ్వర్యంలో త్వరలో నే కార్పొరేషన్, చైర్మన్ల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. నియోజకవర్గాలకు అనుగుణంగా నామి నేటెడ్ పదవుల్లో తమ అనుచరులకు అవకాశాలు ఇవ్వాలని కొందరు నాయకులు కోరు తున్నారు. దీంతో ప్రధానంగా మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి భర్తీపై రాజకీయవర్గా ల్లో చర్చకొనసాగుతోం ది. ఇటీవల మంథని మండలంలోని గుంజ పడుగు గ్రామానికి చెందిన మిటుకు రామ్మూర్తికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి, మిటుకు రామ్మూర్తి కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందినది కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పని చేస్తున్నాడు, దివంగత నేత మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు,తోపాటు ఆయన కుమారుడైన ప్రస్తుత మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరం తరం కృషి చేస్తున్న నాయకుడిగా రామ్మూర్తికి మంచి గుర్తింపు ఉంది.మిటుకు రామ్మూర్తి, ఎస్సీ మాదిగ సామా జిక వర్గానికి చెందిన నాయకుడని, మంథ ని నియోజకవర్గంలో ఆ వర్గం కాంగ్రెస్ పార్టీ కి బలమైన అండగా నిలుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తగిన నామినేటెడ్ పదవు లు ఇప్పటి వరకు సామాజిక వర్గానికి దక్కలేదని నిరాశకు లోనవుతున్నారు. ఈసారి పీఏసీఎస్ చైర్మన్ పదవిని మిటుకు రామ్మూర్తికి కేటాయిస్తే దళిత సామాజిక వర్గానికి న్యాయం చేకూరు తుందని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. సహకార సంఘం చైర్మన్ పదవి కి మిటుకు రామ్మూర్తి సరైన వాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశా భావంతో ఉన్నారు. అయితే మంథని వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవిపై మరి కొంతమంది నాయకు లు ఆశపడుతున్న ట్లు తెలుస్తుంది,వీరు కూడా ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని, కొంతమంది పేర్లను మంత్రికి సిఫారసు చేసినట్లు తెలుస్తుం ది,దీంతో మంథని పట్టణ, నియోజకవ ర్గం మండలాల్లోని ప్రజలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మార్కెట్ చైర్మన్,పదవి ఎవరికి దక్కుతుందోనని జోరుగా చర్చించు కుంటున్నారు.
మంథని వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
RELATED ARTICLES


