Thursday, February 6, 2025

“న్యాయవాదుల రక్షణ చట్టం” తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వారికే ఓట్లు…

కరీంనగర్, నిఘా న్యూస్ : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న న్యాయవాదుల సమస్యల పై ప్రభుత్వాలు పరిష్కరించేలా ఎమ్మెల్సీ అభ్యర్థులు పోరాడాలి అని .బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నట్టే “అడ్వకేట్స్ ఎమ్మెల్సీ” ఉండే విధంగా చట్టం తేవాలి..ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు దీర్ఘకాలంగా పెండింలో ఉన్న న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. నిత్యం ఏదో ఒక చోట న్యాయవాదుల పై దాడులు, హత్యలు జరుగుతున్న కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే “అడ్వకేట్స్ ప్రొటెక్చన్ ఆక్ట్” ను తక్షణమే తీసుకురావాలని బేతి మహేందర్ రెడ్డి కోరారు. అలాగే ఉపాధ్యాయుల కోసం టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నట్టు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉన్నట్టు, చట్ట సభల్లో చట్టాల పై పూర్తి ఆవగాహన ఉన్న న్యాయవాదులకు కూడా న్యాయవాదుల ఎమ్మెల్సీని కూడా ప్రవేశపెట్టేందుకు చట్టం తీసుకురావాలని, దీని పై ఎమ్మెల్సీ అభ్యర్థులు గళం విప్పాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేసారు. ఇదే కాకుండా ఆర్థికంగా వెనుకబడి కొత్తగా ప్రాక్టీస్ కు వచ్చే జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ పదివేల రూపాయిలు ఇచ్చే విధంగా, అలాగే జూనియర్ న్యాయవాదులకు ఆఫీస్ లు పెట్టుకునేందుకు బ్యాంకులు లోన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఖర్చులతో జూనియర్ న్యాయవాదులకు చట్టాల పై ఆవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్ లు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని, వీటితో పాటు న్యాయవాది మరణిస్తే ఇప్పుడున్న వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షల రూపాయలను ఇరవై లక్షలకు పెంచాలని, దీనికి ప్రభుత్వం వేయి కోట్ల నిధులు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కు కేటాయించాలని, అలాగే న్యాయవాదులకు గృహ సముదాయం ఉండేలా “రాష్ట్ర అడ్వకేట్స్ హోసింగ్ సొసైటీ” ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో అడ్వకేట్స్ కాలనీలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి న్యాయవాదులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు పనుల కోసం వెళ్లేవారికి అక్కడి వసతి ఉండేలా “అడ్వకేట్స్ గెస్ట్ హౌస్” ను ఏర్పాటు చేయాలని, అలాగే న్యాయవాదులకు ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్సు ను రెండు లక్షల రూపాయల నుండి ఇరవై లక్షలకు పెంచడమే కాకుండా న్యాయవాదుల తల్లితండ్రులను కూడా ఈ పాలసీ క్రింద చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే న్యాయస్థాన సముదాయంలో న్యాయవాదులు, కక్షిదారులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని హంగులతో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వమే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు గళం విప్పి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెచ్చి న్యాయవాదుల సమస్యల పై పోరాడాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులను కోరారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular