Friday, May 15, 2026

టీవీకే పార్టీ అధినేత విజయ్, సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!?

హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ లోక్‌భవన్‌లో గవర్నర్‌తో రెండోసారి భేటీ అయిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని.. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు.

112 మంది ఎమ్మెల్యే లతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజా రిటీని ఎలా నిరూపిం చుకోగలరు అని విజయ్ ని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది,దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో గవర్నర్ పలు కీలక ప్రశ్నలను విజయ్ ముందు ఉంచినట్లు సమాచా రం.

సభలో ప్రభుత్వ ఏర్పా టుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం టీవీకేకు ఉన్న 112 మందితో పరిపా లన ఎలా సాగిస్తారు?, మెజారిటీకి కావాల్సిన మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీల నుండి వస్తుంది? ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి అంగీకరిం చాయా? వంటి ప్రశ్నల ను గవర్నర్ విజయ్ ముందుంచారు. అయి తే ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించు కుంటానని విజయ్ చెప్పడంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గవర్నర్ అనుమతివ్వ డంతో విజయ్ ప్రమా ణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. ఒకవేళ గవర్నర్ తన అభ్యర్థ నను తిరస్కరిస్తే, ఊరికే కూర్చోకుండా చట్టపరమైన మార్గాల నుఅనుసరించడానికి కూడా టీవీకే సిద్ధమైం దని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్ధతు ప్రకటించగా.. ఇతర పార్టీల మద్ధతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular